అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మోదీ

04-07-2020 Sat 19:59
  • జూలై 4న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం
  • 244వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మోదీ ట్వీట్
  • భారత్, అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని వెల్లడి
Modi wishes Trump and Americans on their Independence Day
జూలై 4న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు, ఆ దేశ ప్రజలకు 244వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. భారత్, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని పేర్కొన్నారు.  స్వేచ్ఛ, మానవ భాగస్వామ్యాలను పెంచి పోషిస్తామని చాటుతూ జరుపుకునేదే స్వాతంత్ర్య దినోత్సవం అని అభివర్ణించారు.