రాజధానిగా అమరావతి కొనసాగుతుందని నిండు సభలో జగన్ చెప్పారు: రఘురామ కృష్ణరాజు

04-07-2020 Sat 19:48
  • అమరావతి రైతుల అంకితభావం చాలా గొప్పది
  • రాజధాని అంశంపై ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలి
  • రాజధానిగా  అమరావతి ఉండాలనేదే నా వ్యక్తిగత నిర్ణయం
Amaravati has to continue as AP capital says Raghu Ramakrishna Raju

అమరావతి రైతుల అంకితభావం చాలా గొప్పదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కితాబిచ్చారు. వారి గొప్పతనాన్ని ప్రతిరోజు గమనిస్తున్నానని చెప్పారు. రాజధాని రైతులకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నానని అన్నారు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని నిండు సభలో జగన్ చెప్పారని... వైసీపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ఇదే అన్నారని చెప్పారు.

రాజధానిగా అమరావతి కొనసాగాలనేదే తన వ్యక్తిగత అభిప్రాయమని రఘురాజు అన్నారు. రాజధాని అంశంపై ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలని... ప్రభుత్వానికి ఇదే తన విన్నపమని చెప్పారు. ప్రజా నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

అమరావతిని రాజధానిగా చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీనికి సంబంధించి అమరావతి రైతులు, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరిందని రఘురాజు అన్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ప్రామిస్ ను నిలబెట్టుకోవాలని చెప్పారు. మూడు రాజధానుల అంశం వైసీపీ మేనిఫెస్టోలో లేదని తెలిపారు.