నెట్స్ లో అత్యంత చెత్త ఆటగాడు గవాస్కర్: కిరణ్ మోరే

04-07-2020 Sat 19:04
  • మైదానంలో గవాస్కర్ పరుగుల వరద పారిస్తుంటారు
  • భయంకరమైన బౌలర్లకు కూడా చుక్కలు చూపించాడు
  • నెట్స్ లో మాత్రం చాలా ఇబ్బంది పడేవాడు
Sunil Gavaskar is a worst player in nets says Kiran More

భారత క్రికెట్ దిగ్గజం గవాస్కర్ పై టీమిండియా మాజీ వికెట్ కీపర్ కితాన్ మోరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెట్స్ లో అత్యంత చెత్త ఆటగాడు గవాస్కర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైదానంలో ఏ జట్టునైనా సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగుల వరదను పారించడంలో గవాస్కర్ దిట్ట అని చెప్పారు. అయితే నెట్ ప్రాక్టీసులో మాత్రం బంతులను ఎదుర్కొనేందుకు ఎంతో ఇబ్బంది పడేవాడని అన్నారు. నెట్స్ లో గవాస్కర్ ను చూస్తే ఇతను అంతర్జాతీయ ఆటగాడేనా? అని అనిపించేదని చెప్పారు. తనకు తెలిసి నెట్స్ లో అత్యంత చెత్త ఆటగాడు గవాస్కర్ అని తెలిపారు.

నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం గవాస్కర్ కు ఇష్టం ఉండదని మోరే చెప్పారు. నెట్స్ లో ఆయన ఆడే తీరుకు, మైదానంలో ఆడే తీరుకు చాలా తేడా ఉంటుందని అన్నారు. ప్రపంచంలోని భయంకరమైన బౌలర్లకు కూడా ఆయన చుక్కలు చూపించారని కొనియాడాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.