ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లా... పవన్ సూచన

04-07-2020 Sat 18:44
  • ఇవాళ అల్లూరి సీతారామరాజు జయంతి
  • నివాళులు అర్పించిన పవన్ కల్యాణ్
  • అల్లూరిని తెలుగునేల ఎన్నటికీ మరువదని వెల్లడి
Pawan suggests to government to name a district after Alluri Sitharama Raju

ఇవాళ మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి. ఆ పోరాట యోధుడికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. పీడిత వర్గాల్లో చైతన్యం రగిలించి, గుండెల్లో ధైర్యాన్ని నింపి బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడిన మహావీరుడు అల్లూరి సీతారామరాజును తెలుగునేల ఎన్నటికీ మరువదని పేర్కొన్నారు. ఆ సాహసి పోరును, పోరాట పంథాను నాడు కొందరు నాయకులు, కొన్ని పత్రికలు హర్షించకపోయినా ఆయన భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఆ సాయుధ వీరుడు జన్మించిన పాండ్రంగి గ్రామాన్ని ఒక సందర్శనీయ క్షేత్రంగా అభివృద్ధి చేయాలని, జిల్లాల పునర్విభజనలో ఒక జిల్లాకు ఆ మన్యం వీరుడి పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు.