జగన్ క్యాంపు కార్యాలయంలో కరోనా కలకలం

04-07-2020 Sat 18:19
  • 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్
  • ఇటీవలే టెస్టులు నిర్వహించిన ఆరోగ్యశాఖ
  • 8 మంది ఏపీఎస్పీ పోలీసులకు కరోనా
10 staff at Jagan camp office tests corona positive

ఏపీ  ముఖ్యమంత్రి జగన్ క్యాంపు  కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. క్యాంప్ ఆఫీస్ వద్ద విధులను నిర్వహిస్తున్న 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. క్యాంపు కార్యాలయం వద్ద 2వ తేదీన వైద్య, ఆరోగ్యశాఖ టెస్టులు నిర్వహించింది. టెస్టు రిపోర్టులు ఈరోజు వచ్చాయి. ఈ టెస్టుల్లో 10 మందికి కరోనా సోకినట్టు తేలింది. కరోనా బారిన పడినవారిలో ఏపీఎస్పీ కాకినాడ బెటాలియన్ కు చెందిన 8 మంది, మరో బెటాలియన్ కు చెందిన ఇద్దరు సిబ్బంది ఉన్నారు.