Swadhatri Scam: హైదరాబాదులో రూ.300 కోట్ల రియల్ ఎస్టేట్ స్కాం.. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

  • 3 వేల మందికి కుచ్చుటోపీ పెట్టిన స్వధాత్రి
  • రూ.300 కోట్ల మేర స్కాం
  • ఏజెంట్లపైనా కేసులు నమోదు చేసే అవకాశం
Police arrest three people in Swadhatri real estate scam

స్వధాత్రి రియల్ ఎస్టేట్ స్కాంలో ముగ్గురు నిందితులను హైదరాబాదు పోలీసులు అరెస్ట్ చేశారు. రఘు, మీనాక్షి, శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 వేల మందికి కుచ్చుటోపీ పెట్టి వారి నుంచి వసూలు చేసిన డబ్బుతో భూములు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. రూ.300 కోట్ల మేర స్కాం జరిగిందని భావిస్తున్నారు. ప్రజల సొమ్ముతో భూములు కొన్న స్వధాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ ఆ భూములను అమ్మేసింది. బ్రోకర్లు, ఏజెంట్ల ద్వారా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన స్వధాత్రి యజమాని యార్లగడ్డ రఘు మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు కొనసాగించారు. ఈ స్కాంలో ఏజెంట్లపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

More Telugu News