పంట పొలాల్లో ఉచితంగా బోర్లు... రైతులకు ఏపీ సర్కారు తియ్యటి కబురు

Sat, Jul 04, 2020, 03:24 PM
AP Government will give free bore wells for farmers
  • 5 ఎకరాల లోపు పొలం ఉన్నవారికి శుభవార్త
  • గ్రామసచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే ఉచిత బోరు
  • పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు నకళ్లు సమర్పిస్తే చాలు
ఏపీ ప్రభుత్వం వ్యవసాయదారులకు ఉపకరించేలా మరో పథకం తీసుకువచ్చింది. పంట పొలాల్లో ఉచితంగా బోర్లు వేయాలని నిర్ణయించింది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఉచిత బోర్లు వేయిస్తామని వెల్లడించింది. అర్హత కలిగిన రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు నకళ్లతో గ్రామసచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునేవారికి కొన్ని విధివిధానాలు, అర్హతలు రూపొందించారు. రైతుకు కనీసం రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండాలి. ఒకవేళ తానొక్కడికే అంత భూమి లేకపోతే, తన పొలం పక్కనున్న రైతులతో కలిసి ఓ గ్రూపుగా ఏర్పడి ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అప్పటికే బోర్లు ఉన్న పొలాలను ఈ ఉచిత పథకం నుంచి మినహాయించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad