Vikas Dubey: గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన 25 పోలీసు బృందాలు

over 25 UP Police teams formed to nab Vikas Dubey
  • 8 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న వికాస్ దూబే గ్యాంగ్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఏడుగురు పోలీసులు
  • మృతుల కుటుంబాలకు రూ. కోటి ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం
ఎనిమిది మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను పట్టుకోవడానికి 25 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ సందర్భంగా కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ మాట్లాడుతూ, దూబేను, అతని అనుచరులను పట్టుకోవడానకి 25 బృందాలను రంగంలోకి దించామని... ఉత్తరప్రదేశ్ లోని పలు జిల్లాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో సైతం రెయిడింగులు జరుగుతున్నాయని చెప్పారు. 500 మొబైల్ ఫోన్లను నిఘా విభాగం స్కాన్ చేస్తోందని  తెలిపారు. స్పెషల్ టాస్క్ పోర్స్ ను కూడా రంగంలోకి దించామని చెప్పారు.

దూబే ఆచూకీ తెలిపిన వారికి రూ. 50 వేల నజరానా ఇస్తామని మోహిత్ తెలిపారు. ఆచూకీ తెలిపిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని చెప్పారు. ఎన్ కౌంటర్ లో గాయపడ్డ ఏడుగురు పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

మరోవైపు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్పూరుకు వెళ్లి మృతి చెందిన పోలీసుల కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పెన్షన్ తో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పారు. ఈ ఘాతుకానికి పాల్పడిని వారిని పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని అన్నారు.
Vikas Dubey
Gangster
Uttar Pradesh

More Telugu News