జాతీయ పతాక రూపశిల్పి పింగళి తెలుగువాడు కావడం మనకు గర్వకారణం: సీఎం జగన్

04-07-2020 Sat 13:27
  • నేడు త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి
  • నివాళులు అర్పించిన సీఎం జగన్
  • పింగళి పోరాట యోధుడు అంటూ ట్వీట్
CM Jagan pays tributes to Pingali Venkaiah

త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య వర్థంతి సందర్భంగా సీఎం జగన్ స్పందించారు. ఆయనకు నివాళులు అర్పించారు. మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు. పింగళి పోరాట యోధుడు అని, ప్రతి భారతీయుడు గర్వపడేలా పతాకాన్ని రూపొందించారని కీర్తించారు.