Railway Line: నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గంలో మరింత పురోగతి... పూర్తయిన పిడుగురాళ్ల-శావల్యాపురం రైల్వే లైన్

  • 46 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం
  • ఇక రైళ్లు నడుస్తాయన్న మేకపాటి గౌతమ్ రెడ్డి
  • కేంద్రం, రాష్ట్రం 50:50 నిష్పత్తిలో వ్యయాన్ని భరిస్తాయని వెల్లడి
New railway line between Piduguralla and Savalyapuram has completed

వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణ దూరం తగ్గించడంతో పాటు, అనేక ప్రాంతాలకు రైల్వే సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా కేంద్రం కొత్త రూట్లలో రైల్వే లైన్లు నిర్మిస్తోంది. ఇలాంటి మార్గాల్లో నడికుడి-శ్రీకాళహస్తి మార్గం ఒకటి. తాజాగా ఈ రూట్లో పిడుగురాళ్ల-శావల్యాపురం మధ్య 46 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైను నిర్మాణం పూర్తయిందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఇకపై ఈ ట్రాక్ లో రైళ్లు నడుస్తాయని తెలిపారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను ప్రాజెక్టులో భాగంగా ఈ కొత్త ట్రాక్ నిర్మించడం జరిగిందని వివరించారు. దీని వ్యయాన్ని కేంద్రం, రాష్ట్రం 50:50 నిష్పత్తిలో భరిస్తాయని పేర్కొన్నారు.

More Telugu News