America: అమెరికాలో కరోనా మళ్లీ విలయ తాండవం.. వరుసగా రెండో రోజూ 50 వేలకు పైగా కేసుల నమోదు

  • అమెరికాలోని 40 రాష్ట్రాలను కమ్మేసిన మహమ్మారి
  • ప్రపంచవ్యాప్తంగా 1.10 కోట్లకు చేరిన కరోనా కేసులు
  • కరోనాతో 5.26 లక్షల మంది మృతి
Over 50 thousand cases recorded in America 2nd day also

అమెరికాలో మళ్లీ కరోనా వింధ్వసం మొదలైంది. నిన్నమొన్నటి వరకు అమెరికాను అతలాకుతలం చేసిన మహమ్మారి ఆ తర్వాత కొంత నెమ్మదించింది. అయితే, తాజాగా మళ్లీ ఇప్పుడు విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 55 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 50 వేలకు పైగా కేసులు నమోదు కావడం వరుసగా ఇది రెండోరోజు. ఇక, దేశంలోని 50 రాష్ట్రాల్లో 40 రాష్ట్రాలలో కరోనా బారినపడి విలవిల్లాడుతున్నాయి. తాజాగా నమోదైన 55 వేల కేసుల్లో 25 వేలు ఆరిజోనా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్ రాష్ట్రాల్లో నమోదు కావడం గమనార్హం.

కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.10 కోట్ల మంది కరోనా బాధితులుగా మారగా, ఇప్పటి వరకు 5.26 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, తొలి నుంచీ కరోనాను తేలిగ్గా తీసుకున్న బ్రెజిల్‌లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 32,107 మంది కరోనా బారినపడ్డారు. 990 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆ దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 15 లక్షల మార్క్  దాటిపోయింది. ఇక, రష్యాలో 6,718, పాకిస్థాన్‌లో 4,193, దక్షిణాఫ్రికాలో 8,728 మందికి కొత్తగా వైరస్ బారినపడ్డారు.

More Telugu News