దేశంలో కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 22,771 మందికి సోకిన కరోనా

04-07-2020 Sat 10:09
  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 6,48,315
  • మృతుల సంఖ్య మొత్తం 18,655
  • 2,35,433 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • నిన్నటి వరకు మొత్తం 95,40,132  శాంపిళ్ల పరీక్ష
India reports 442 deaths and highest singleday spike of 22771

భారత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 22,771 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 442 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 6,48,315కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 18,655కి పెరిగింది. 2,35,433 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,94,227 మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 95,40,132  శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,42,383 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.