Raghu Kunche: రాజీవ్ హత్యోదంతంపై సినిమా.. మురుగన్ పాత్రలో సంగీత దర్శకుడు!

  • 'పలాస 1978' ద్వారా రఘు కుంచెకు మంచి పేరు 
  • కొక్కిరిగడ్డ మహేంద్ర దర్శకత్వంలో 'కథా నళిని'
  • మురుగన్ పాత్ర పోషిస్తున్న రఘు 
  • మురుగన్, నళినిల ప్రేమకథ హైలైట్         
Music director plays Murugan role

మంచి సంగీత దర్శకుడిగా పేరుతెచ్చుకున్న రఘు కుంచె ఇప్పుడు ఆర్టిస్టుగా బిజీ అవుతున్నాడు. ఆమధ్య వచ్చిన 'పలాస 1978' చిత్రంలో పోషించిన పాత్ర ద్వారా ఆయన మంచి పేరుతెచ్చుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

1991లో జరిగిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్య సంఘటన కథాంశంతో ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. రాజీవ్ హత్య కేసులో మొదట్లో మరణశిక్ష పడి, అనంతరం అది యావజ్జీవ శిక్షగా మారడంతో జైలు జీవితాన్ని గడుపుతున్న ప్రధాన దోషులలో ఒకడైన మురుగన్ పాత్రను ఈ చిత్రంలో రఘు కుంచె పోషిస్తున్నారు.

ఇదే కేసులో గత ఇరవై తొమ్మిదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న మురుగన్ భార్య నళిని పాత్రలో ఓ ప్రముఖ నటి నటిస్తోంది. ఈ సినిమాలో హత్య కుత్రకోణంతో పాటు వీరి ప్రేమకథను ఎక్కువగా డీల్ చేస్తున్నారట. తెలుగులో ఈ చిత్రానికి 'కథా నళిని' అనే టైటిల్ని నిర్ణయించారు. నూతన దర్శకుడు కొక్కిరిగడ్డ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గోగో బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

More Telugu News