ESI Scam: ఈఎస్ఐ కుంభకోణంలో మరొకరిని అరెస్ట్ చేసిన ఏసీబీ.. మొత్తం 10కి చేరిన అరెస్టులు

ACB Officials arrested another one in ESI Scam
  • ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు
  • విజయవాడ భవానీపురానికి చెందిన తిరుమల ఏజెన్సీ నిర్వాహకుడి అరెస్ట్
  • 14 రోజుల రిమాండ్
ఈఎస్ఐ కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తాజాగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య పదికి పెరిగింది.

ఈ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే జైలులో ఉండగా, తాజాగా విజయవాడ భవానీపురంలో తిరుమల మెడికల్ ఏజెన్సీని నిర్వహిస్తున్న తెలకపల్లి కార్తీక్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అతడిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను  విజయవాడ సబ్‌జైలుకు తరలించారు.
ESI Scam
Atchannaidu
ACB
Arrest
Tirumala Agency
Vijayawada

More Telugu News