Kollu Ravindra: తూర్పు గోదావరి జిల్లాలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు

Police arrests Kollu Ravindra in East Godavari district
  • మచిలీపట్నంలో హత్యకు గురైన మోకా భాస్కరరావు
  • మోకా భాస్కరరావు హత్యకేసులో రవీంద్రపై ఎఫ్ఐఆర్
  • విశాఖ వెళుతుండగా అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు
మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం వైపు వెళుతుండగా తూర్పు గోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద ఆయనను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విజయవాడ తరలించారు.

మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర పేరును కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. దాంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. పోలీసు బృందాలు భారీ ఎత్తున గాలింపు చేపట్టాయని కూడా ప్రచారం జరిగింది. హత్యకేసులో కొల్లు రవీంద్రను నిందితుడిగా పరిగణించాక, పోలీసులు ఆయన నివాసంలో సోదాలు జరిపారు. ఓ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
Kollu Ravindra
Arrest
East Godavari District
Police
Moka Bhaskar Rao
Murder
Machilipatnam
YSRCP
Telugudesam

More Telugu News