పవన్ కల్యాణ్ సినిమాలో తమన్నా!

03-07-2020 Fri 21:27
  • పవన్ తో 'వకీల్ సాబ్' నిర్మిస్తున్న దిల్ రాజు
  • శ్రుతి హాసన్ తప్పుకుందంటూ వార్తలు
  • ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో తమన్నా
Thamanna to play heroine in Pawans film

గతంలో పవన్ కల్యాణ్ సరసన 'కెమేరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో కథానాయికగా నటించిన తమన్నా ఇప్పుడు మళ్లీ ఆయనతో మరో సినిమా చేసే ఛాన్స్ పొందనుంది. పవన్ ప్రస్తుతం 'వకీల్ సాబ్' చిత్రంలో నటిస్తున్నారు. వేణు శ్రీరాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నాను కథానాయికగా తీసుకున్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి ఈ చిత్రంలో శ్రుతి హాసన్ ను మొదట హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే, ఆమె ఇటీవల ఈ ప్రాజక్టు నుంచి తప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. దాంతో ఆ పాత్రకు తమ్మూని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో పవన్ కి చెందిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో తమన్నా కనిపిస్తుందని అంటున్నారు.

ఇక ఈ చిత్రం ప్రోగ్రెస్ విషయానికి వస్తే, లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రం షూటింగ్ చాలా భాగం జరిగింది. దాంతో మరికొంత టాకీ పార్ట్ చిత్రీకరణ మాత్రం మిగిలివుంది. అందులోనూ పవన్ పై చేయాల్సిన సన్నివేశాలు చిత్రీకరించాల్సి వుందట. మళ్లీ షూటింగులు ప్రారంభం కాగానే వీటిని పూర్తిచేస్తారు. హిందీలో వచ్చిన 'పింక్' చిత్రానికి రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది.