Rahul Gandhi: ఇక్కడ ఎవరో అబద్ధం చెబుతున్నారు: రాహుల్ గాంధీ

  • లడఖ్ లో పర్యటించిన మోదీ
  • పరోక్ష వ్యాఖ్యలు చేసిన రాహుల్
  • లడఖ్ వాసుల వీడియో పోస్టు చేసిన కాంగ్రెస్ అగ్రనేత
Rahul says some one is lying in Ladakh issue

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ లడఖ్ లోని నిము సైనిక స్థావరంలో పర్యటించారు. ఈ సందర్భంగా సైనికులకు జాతి తరఫున సందేశాన్ని అందించారు. అయితే, దీనిపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. "ఓవైపు లడఖ్ వాసులేమో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చెబుతున్నారు. ప్రధాని మాత్రం మన భూమిని ఎవరూ తీసుకోలేదంటున్నారు. కచ్చితంగా ఇక్కడెవరో అబద్ధం చెబుతున్నారు" అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, కొందరు లడఖ్ వాసుల అభిప్రాయాలను కూడా ఓ వీడియో ద్వారా అందించారు.

గాల్వన్ లోయలో ఘర్షణలు జరిగినప్పటి నుంచి రాహుల్ గాంధీ ఇదే తరహాలో ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోదీ మాట్లాడుతూ, మన భూభాగం ఎలాంటి దురాక్రమణలకు గురికాలేదన్నారు. ఈ వ్యాఖ్యలను రాహుల్ తప్పుబట్టారు. ఎలాంటి దురాక్రమణలు జరగకపోతే గాల్వన్ లోయలో ఘర్షణలు జరిగి భారత సైనికులు ఎందుకు చనిపోయారని మోదీని ప్రశ్నించారు.

More Telugu News