హైదరాబాదులో దారుణం... మంచినీటి ట్యాంకర్ పై నిల్చుని కాళ్లు కడుక్కున్న డ్రైవర్!

03-07-2020 Fri 18:20
  • వీడియో వైరల్
  • డ్రైవర్ పై పోలీసులకు ఫిర్యాదు
  • కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు
Water Tanker driver cleans his legs while standing upon the tanker

సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో వైరల్ గా మారింది. హైదరాబాద్ లో ఓ  డ్రైవర్ తన మంచినీటి ట్యాంకర్ ఎక్కి ప్రజలకు సరఫరా చేసే నీటితో కాళ్లు కడుక్కోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పైపు నుంచి వస్తున్న నీళ్లు ట్యాంకర్ లో పడుతుండగా, ఆ డ్రైవర్ కాళ్లు కడుక్కోవడం వీడియోలో స్పష్టంగా వెల్లడైంది. అతడు కాళ్లు కడిగిన నీళ్లు ట్యాంకర్ లోకే వెళ్లాయి. అతడిని హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ ఉద్యోగిగా భావిస్తున్నారు.

ఈ ఘటన మూసాపేటలో జరిగినట్టు సమాచారం. ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలతో మరింత ఆందోళన కలిగిస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్యాంకర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.