Stock Market: నేడు కూడా లాభాలలోనే ముగిసిన స్టాక్ మార్కెట్

  • మార్కెట్ కు వరుసగా మూడో రోజు లాభాలు
  • సెన్సెక్స్ 177.72 పాయింట్ల లాభం
  • నిఫ్టీ 55.65 పాయింట్ల లాభం  
Stock Market gains profits

స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాలలో పయనించాయి. ఫైజర్, బయో ఎన్ టెక్ కంపెనీలు తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ మానవులపై ప్రయోగాలలో సత్ఫలితాలను ఇస్తున్నట్టు వార్తలు రావడం మదుపరులపై సానుకూల ప్రభావాన్ని చూపిందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.

ఐటీ, ఆటోమొబైల్, ఎనర్జీ రంగాల షేర్లలో కొనుగోళ్లు బాగా జరగడంతో సెన్సెక్స్  177.72 పాయింట్లు లాభపడి 36021.42 వద్ద; నిఫ్టీ 55.65 పాయింట్ల లాభంతో 10607.35 వద్ద ముగిశాయి.

ఇక నేటి ట్రేడింగులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బీహెచ్ఈఎల్, ఐషర్ మోటార్స్, టీవీఎస్ మోటార్, హీరో మోటాకార్ప్, టీసీఎస్, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్ తదితర షేర్లు లాభపడగా; ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సిప్లా తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.    

More Telugu News