ఉదయభాను గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించిన రేణూ దేశాయ్

03-07-2020 Fri 17:16
  • రేణు దేశాయ్, బహ్మానందంలకు చాలెంజ్ విసిరిన ఉదయభాను
  • ఇప్పటికే చాలెంజ్ పూర్తి చేసిన బ్రహ్మీ
  • కుమార్తె ఆద్యతో కలిసి మొక్కలు నాటిన రేణు
 Renu Desai accepts Udayabhanu green challenge

కరోనా రోజుల్లోనూ గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోతోంది. తాజాగా యాంకర్ ఉదయభాను విసిరిన చాలెంజ్ ను ప్రముఖ నటి, మరాఠీ దర్శకురాలు రేణు దేశాయ్ స్వీకరించారు. ఈ చాలెంజ్ ను గౌరవిస్తూ తన కుమార్తె ఆద్యతో కలిసి పలు మొక్కలు నాటారు.

దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ బీజం వేసిన ఈ మొక్కలు నాటే చాలెంజ్ సెలబ్రిటీలను విశేషంగా ఆకర్షిస్తోంది. మొక్కలు నాటిన ఉదయభాను ఆపై రేణు దేశాయ్, సీనియర్ కమెడియన్ బ్రహ్మానందంలకు చాలెంజ్ విసిరారు. బ్రహ్మీ ఇప్పటికే చాలెంజ్ పూర్తి చేశారు.