మోదీ లడఖ్ పర్యటనపై ఆగమేఘాలపై స్పందించిన చైనా

03-07-2020 Fri 16:58
  • లడఖ్ లో పర్యటించిన మోదీ
  • సైనికుల్లో ఉత్సాహం కలిగించిన ప్రధాని
  • ఉద్రిక్తతలు పెంచే చర్యల్లో ఎవరూ పాల్గొనకూడదన్న చైనా
China responds immediately on Modi Ladakh visit

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ లడఖ్ లో పర్యటించి, సరిహద్దు విధుల్లో ఉన్న భారత సైన్యాన్ని ఉత్తేజపరిచేలా ప్రసంగించారు. దీనిపై చైనా హడావుడిగా స్పందించింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయని, ఈ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇరు దేశాలు సైనిక, దౌత్యమార్గాల్లో చర్చలు జరుపుతున్నాయని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఇలాంటి నేపథ్యంలో సరిహద్దుల్లో పరిస్థితి తీవ్రతను పెంచేలా ఎవరూ వ్యవహరించకూడదు అంటూ మోదీ లడఖ్ పర్యటను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ ఓ ప్రకటన విడుదల చేశారు.