Ramgopal Varma: వర్మ నుంచి మరో హారర్ చిత్రం '12 ఓ క్లాక్'

Another horror film from Varma
  • లాక్ డౌన్ లో వరుసగా సినిమాలు చేస్తున్న వర్మ
  • ఇప్పటికే 'క్లైమాక్స్', 'నేకేడ్' చిత్రాల విడుదల
  • 'పే ఫర్ వ్యూ' విధానంలో రిలీజ్
  • తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడిస్తున్న వర్మ
ఈ లాక్ డౌన్ సమయంలో సినిమా వాళ్లంతా ఖాళీగా వుండిపోతే, ఒక్క రాంగోపాల్ వర్మ మాత్రం చేతి నిండా పనితో ఫుల్ బిజీగా వున్నారు. 'లాక్ డౌన్ నాకేమి అడ్డం?' అన్నట్టుగా వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. వాటిని తన ప్రత్యేకమైన యాప్ ద్వారా ఆన్ లైన్ లో 'పే ఫర్ వ్యూ' విధానంలో విడుదల చేస్తున్నారు. వీటిని తక్కువ ఖర్చుతో నిర్మించి, ఎక్కువ లాభాలను పొందుతున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి కూడా. ఇప్పటికే ఆయన 'క్లైమాక్స్', 'నేకేడ్' చిత్రాలను ఈ లాక్ డౌన్ కాలంలో నిర్మించి, విడుదల చేయడం కూడా జరిగిపోయింది.

ఈ క్రమంలో వర్మ మరో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీని పేరు '12 ఓ క్లాక్' (12 O' CLOCK). ఇది తన నుంచి వస్తున్న మరో హారర్ చిత్రమని వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదేమీ లఘు చిత్రం కాదనీ, ఒక గంట 45 నిమిషాల నిడివితో ఈ సినిమా సాగుతుందని ఆయన చెప్పారు. ఈ రాత్రి ఏడు గంటలకు దీని ట్రైలర్ ని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక సినిమా కూడా త్వరలోనే విడుదల అవుతుందని తెలుస్తోంది. కాగా, వర్మ గతంలో 'రాత్', 'భూత్' వంటి హారర్ చిత్రాలను రూపొందించిన సంగతి విదితమే.
Ramgopal Varma
Horror Film
12 O' CLOCK
Rath

More Telugu News