అజ్ఞాతంలోకి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర..?

Fri, Jul 03, 2020, 03:42 PM
Police search for former minister
  • మచిలీపట్నంలో మోకా భాస్కరరావు హత్య
  • కొల్లు రవీంద్ర పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన పోలీసులు
  • మాజీ మంత్రి ఇంట్లో సోదాలు
మచిలీపట్నంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. అటు, మోకా భాస్కరరావు కుటుంబసభ్యులు, వైసీపీ నేతలు కూడా కొల్లు రవీంద్రపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొల్లు రవీంద్ర నివాసంలో సోదాలు జరిపిన పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నట్టు తెలుస్తోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad