Indian Railways: ప్రయాణికులు లేక వెలవెలబోతున్న స్టేషన్లు.. స్టాపులను కుదించాలని రైల్వే శాఖ నిర్ణయం

  • క్రమంగా తగ్గిపోతున్న ప్రయాణికుల సంఖ్య
  • వందల సంఖ్యలో మిగిలిపోతున్న బెర్త్‌లు
  • డిమాండ్ లేని స్టేషన్లను గుర్తించాలంటూ ఆయా జోన్లకు సూచించిన బోర్డు
Indian Railway decided to cut stops in special trains

కరోనా వైరస్ కారణంగా సాధారణ సర్వీసులను రద్దు చేసిన రైల్వే శాఖ ప్రస్తుతం పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతోంది. రైలు సర్వీసులు ప్రారంభమైన తర్వాత తొలి వారం రోజుల్లో ప్రయాణికులు పోటెత్తగా ఆ తర్వాత ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. చాలా స్టేషన్లలో అసలు ప్రయాణికులు ఎక్కడం కానీ, దిగడం కానీ లేదు. దీంతో ఇప్పుడు ఇలాంటి స్టేషన్లలో రైళ్లను నిలపకూడదని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. స్టాపుల్ని కుదించాలని నిర్ణయించిన రైల్వే.. ఆ జోన్లలో ఇలాంటి స్టేషన్లను గుర్తించాలని సంబంధిత అధికారులకు సూచించినట్టు సమాచారం. మరోవైపు, సికింద్రాబాద్-పాట్నా, పాట్నా-సికింద్రాబాద్ మధ్య రెండు రైళ్లు నడపాలని అధికారులు నిర్ణయించారు. వీటిని వారానికి రెండు రోజులు మాత్రమే నడపనున్నారు. కాగా, దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌తో పలు రైళ్లలో వందల సంఖ్యలో బెర్త్‌లు ఖాళీగా మిగిలిపోతున్నట్టు అధికారులు తెలిపారు.

More Telugu News