సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- అప్పుడే పదేళ్లవుతోందంటున్న రకుల్
- షూటింగుకి సిద్ధమవుతున్న గోపీచంద్
- చైతూ, విక్రంకుమార్ సినిమా అప్ డేట్
* యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా రూపొందుతున్న 'సీటీమార్' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగ్ ఆగస్టు నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగుతో పాటు తేజ దర్శకత్వంలో రూపొందే 'అలివేలుమంగ వెంకటరమణ' చిత్రం షూటింగులో కూడా గోపీచంద్ వచ్చే నెల నుంచి పాల్గొంటాడట.
* నాగ చైతన్య హీరోగా విక్రంకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభమవుతుంది. ఇందులో సమంత కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి 'థ్యాంక్ యూ' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు.