Imasq Busses: విజయవాడలో ఐమాస్క్ బస్సులతో కరోనా టెస్టులు నిర్వహిస్తున్న ప్రభుత్వం

AP govt conducting corona tests with Imasq busses
  • కరోనా టెస్టుల సంఖ్యను పెంచిన ఏపీ ప్రభుత్వం
  • విజయవాడలో రోజుకు 2 వేల మందికి టెస్టులు
  • నగరంలో 8 ప్రాంతాల్లో ఐమాస్క్ బస్సులతో టెస్టులు
కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది. ఇప్పటికే కరోనా టెస్టుల విషయంలో పలు రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టుల సంఖ్యను ప్రభుత్వం భారీగా పెంచింది. తాజాగా విజయవాడలో ఐమాస్క్ బస్సులతో టెస్టులను నిర్వహిస్తోంది. నగరంలోని 8 ప్రాంతాల్లో టెస్టులను నిర్వహించింది. విజయవాడలో రోజుకు 2 వేల మందికి కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు.

మరోవైపు టెస్టులతో  పాటు... ప్రజలలో కరోనా పట్ల అవగాహనను పెంచే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతోంది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. సమూహాలుగా తిరగొద్దని సూచిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కరోనాల లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరి డేటాను హెల్త్ వర్కర్లు గ్రామ వాలంటీర్లు సేకరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కూడా పరీక్షలను నిర్వహించిన తర్వాతే వారిని రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.
Imasq Busses
corona Tests
Andhra Pradesh

More Telugu News