Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సంజయ్ లీలా భన్సాలీ, కంగనా రనౌత్ లను ప్రశ్నించనున్న పోలీసులు

Police will question Sanjay Leela Bhansali and Kangana in Sushant case
  • ఇటీవల సుశాంత్ ఆత్మహత్య
  • సుశాంత్ ను తొక్కేశారంటూ ఆరోపణలు
  • కుట్ర కోణంలో పోలీసుల దర్యాప్తు!
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇటీవలే ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం ఇది ఆత్మహత్యేనని తేల్చిన పోలీసులు, అందుకు దారితీసిన పరిస్థితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సుశాంత్ ను వృత్తిపరంగా ఎదగనివ్వకుండా చేసేందుకు ఉద్దేశపూర్వక యత్నాలు జరిగాయన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ లను పోలీసులు విచారించనున్నారు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.... సంజయ్ లీలా భన్సాలీ గతంలో సుశాంత్ కు నాలుగు సినిమాలు ఆఫర్ చేశారు. కానీ వాటిలో ఒక్కటి కూడా సుశాంత్ కు ఫైనలైజ్ కాలేదు. ఒక్కటి కాదు, ఏకంగా నాలుగు చిత్రాలు చివరి నిమిషంలో చేజారడం సందేహాలకు తావిస్తోంది. మరోవైపు, సుశాంత్ ఆత్మహత్య తర్వాత కంగనా రనౌత్ ఇండస్ట్రీ తీరుతెన్నులపై బాహాటంగా విరుచుకుపడ్డారు. ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతి కారణంగానే సుశాంత్ కు అవకాశాలు రాకుండా పోయాయని ఆరోపించారు.

మరోపక్క, ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమా? అనే కోణంలోనూ దర్యాప్తు చేసిన పోలీసులు ఇటీవలే నటి రియా చక్రవర్తి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. రియాతో సుశాంత్ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నట్టు చిత్రవర్గాలంటున్నాయి.
Sushant Singh Rajput
Police
Sanjay Leela Bhansali
Kangana Ranaut
Bollywood

More Telugu News