Sensex: ఐటీ, ఆటో షేర్ల అండతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 429 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 122 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 6 శాతానికి పైగా పుంజుకున్న ఎం అండ్ ఎం
Sensex closes 429 points high

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆటో షేర్లు లాభాలను ముందుండి నడిపించాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్ల వరకు పెరిగింది. అయితే, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 429 పాయింట్ల లాభంతో 35,844కి పెరిగింది. నిప్టీ 122 పాయింట్లు పుంజుకుని 10,552 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (6.05%), హీరో మోటోకార్ప్ (4.93%), టైటాన్ కంపెనీ (3.98%), టాటా స్టీల్ (3.43%), ఇన్ఫోసిస్ (3.25%).

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-2.24%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.85%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.35%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.34%), భారతి ఎయిర్ టెల్ (-0.23%).

More Telugu News