Junior NTR: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ చిన్ననాటి వీడియో

Junior NTR dance video going viral in social media
  • చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్సులో తారక్ కు ప్రావీణ్యం
  • భరతనాట్యం నేర్పించిన తారక్ తల్లి
  • వైరల్ అవుతున్న స్కూల్ డేస్ వీడియో
జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడే కాదు... అద్భుతమైన డ్యాన్సర్ కూడా. ఎలాంటి క్లిష్టమైన స్టెప్పులనైనా అవలీలగా చేసేయడం తారక్ కు వెన్నతో పెట్టిన విద్య. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ లో తారక్ కు ప్రవేశం ఉంది. తారక్ అమ్మ ఆయనకు భరతనాట్యం నేర్పించారు. అప్పట్లో పలు డ్యాన్స్ షోలను ఇచ్చాడు. బహుమతులను కూడా గెలుచుకున్నాడు. తదనంతర కాలంలో హీరో అయిన తర్వాత డ్యాన్సులను ఇరగదీస్తున్నాడు. స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు తారక్ ఇచ్చిన ఓ నృత్య ప్రదర్శన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో తారక్ హావభావాలు ఆకట్టుకుంటున్నాయి.

Junior NTR
Tollywood
Dance

More Telugu News