కీలక నిర్ణయం తీసుకున్న జెనీలియా, రితీశ్ దేశ్ ముఖ్!
- అవయవ దానం చేయాలని నిర్ణయించిన జంట
- ఎప్పటి నుంచో దీనిపై ఆలోచిస్తున్నామన్న జెనీలియా
- అవయవ దానం చేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని విన్నపం
తాజాగా జెనీలియా, రితీశ్ జంట ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా జెనీలియా మాట్లాడుతూ, అవయవదానం గురించి తామిద్దరం చాలా కాలంగా ఆలోచిస్తున్నామని తెలిపింది. అయితే అది ఇంత వరకు కుదరలేదని చెప్పింది. డాక్టర్స్ డే సందర్భంగా అవయవాలను దానం చేస్తామనే ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పింది. ఇతరులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి వారికి జీవితాన్ని ఇవ్వడమేనని తెలిపింది. ఇతరుల ప్రాణాలను కాపాడటానికి మీరు కూడా ముందుకు రండని అభిమానులకు పిలుపునిచ్చింది. అవయవ దానం చేస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరింది.