Chandrababu: మీవి పద్ధతిలేని రాజకీయాలు: వైసీపీ సర్కారుపై చంద్రబాబు ధ్వజం

Chandrababu terms YSRCP politics has no ethics
  • చంద్రబాబు మీడియా సమావేశం
  • అచ్చెన్న అరెస్ట్ తో భయపెట్టాలనుకున్నారంటూ ఆగ్రహం
  • సుప్రీం ఆదేశాలను, మానవ హక్కులను ఉల్లంఘించారని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అచ్చెన్నాయుడి విషయంలో మానవ హక్కులు ఉల్లంఘించడంతో పాటు సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోలేదని అన్నారు. ఒక వ్యక్తి శస్త్రచికిత్స చేయించుకుంటే అతడిని ఎలా అరెస్ట్ చేయాలన్న దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నా, ప్రభుత్వం కావాలనే అచ్చెన్నాయుడి విషయంలో భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించిందని తెలిపారు. మీవి పద్ధతిలేని రాజకీయాలు అంటూ మండిపడ్డారు.

"అచ్చెన్నాయుడు ఏమైనా టెర్రరిస్టా? లేక దొంగా? ఎక్కడికి పారిపోతాడు? గోడలు దూకి వెళ్లి అరెస్ట్ చేయాలా? తనకు ఆపరేషన్ జరిగిందని చెప్పినా 600 కిలోమీటర్ల దూరం తీసుకువచ్చారు. దాంతో గాయం తిరగబెట్టింది. రెండోసారి కూడా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రిలోనూ డ్రామాలు ఆడారు. తనకు అనారోగ్యంగా ఉందన్నా గానీ, కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉంచినా గానీ, డిశ్చార్జి చేశారు. వీల్ చెయిర్ లో బయటికి తీసుకొచ్చి, అంబులెన్స్ లో ఎక్కించుకుని జైలుకి తీసుకెళ్లారు. పైశాచిక ఆనందం తప్ప ఇది మరొకటి కాదు" అంటూ విమర్శించారు.
Chandrababu
YSRCP
Politics
Ethics
Atchannaidu
Arrest

More Telugu News