Chandrababu: విజయసాయిరెడ్డికి పుట్టినరోజు కానుకగా రూ.307 కోట్లు కట్టబెట్టారు: చంద్రబాబు

Chandrababu alleges AP government gifted Vijayasai Reddy on his birthday
  • నిన్న విజయసాయిరెడ్డి పుట్టినరోజు
  • విజయసాయిరెడ్డికి అంబులెన్స్ లతో కానుక ఇచ్చారన్న చంద్రబాబు
  • సర్కారు కొత్తగా చేసిందేమీలేదంటూ విమర్శలు
ఏపీలో ఒకేసారి 1088 అంబులెన్స్ లను సీఎం జగన్ నిన్న విజయవాడలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబునాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. నిన్న (జూలై 1) విజయసాయిరెడ్డి పుట్టినరోజు అని, ఆయనకు పుట్టినరోజు నాడు ఇన్ని అంబులెన్స్ లతో కానుక ఇచ్చారని, అంబులెన్స్ ల వ్యవహారంలో 307 కోట్ల మేర కుంభకోణం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు.

విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన సంస్థకు అంబులెన్స్ ల నిర్వహణ అప్పగించారని మండిపడ్డారు. మీకు కావాల్సిన వాళ్ల కోసం వాహనాలు ఇచ్చేందుకు ఇంత షో చేస్తారా? ఇలాంటి తప్పుడు విధానాలకు పాల్పడతారా? అంటూ ప్రశ్నించారు. తాము గతంలోనే 1500 అంబులెన్స్ లు ఇచ్చామని, వాటిలోనూ అత్యాధునిక సౌకర్యాలున్నాయని వివరించారు. ఇవాళ పెద్ద ఎత్తున వాణిజ్య ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకోవడం తప్ప వైసీపీ సర్కారు కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు.
Chandrababu
Vijay Sai Reddy
Ambulance
Birthday Gift
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News