IOCL: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పగ్గాలు చేపట్టిన శ్రీకాంత్ మాధవ్ వైద్య!

Srikant Madhv Vaidya Takes Charge as IOCL Chairman
  • చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ కు చైర్మన్ గా కూడా
  • పెట్రోనెట్ ఎల్ఎన్జీ బోర్డులో డైరెక్టర్ బాధ్యతల్లోనూ
  • వెల్లడించిన ఇండియన్ ఆయిల్ వర్గాలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా శ్రీకాంత్ మాధవ్ వైద్య బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో ఆయన చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గానూ వ్యవహరిస్తారని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇండియన్ ఆయిల్, ఇండియన్ ఆయిల్ టాంకింగ్ లిమిటెడ్ అనుబంధ స్వతంత్ర చమురు శుద్ధి సంస్థ, హిందుస్థాన్ ఉర్వారక్ అండ్ రసాయన్ లిమిటెడ్ సహా టెర్మినలింగ్ సేవలను అందించే మరో జాయింట్ వెంచర్ రత్నగిరి రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ బోర్డులో ఉన్న మాధవ్ వైద్య, పెట్రోనెట్ ఎల్ఎన్జి లిమిటెడ్ బోర్డులో డైరక్టర్ గా కూడా కొనసాగనున్నారు.

  • Loading...

More Telugu News