TikTok: నిషేధంపై కోర్టుకెళ్లేందుకు టిక్‌టాక్‌ యత్నాలు.. ఆదిలోనే షాక్!

  • తమ తరఫున వాదించాలని మాజీ అటార్నీ జనరల్‌ను కోరిన టిక్‌టాక్
  • న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయడానికి ప్రయత్నాలు
  • అందుకు ఒప్పుకోని ముకుల్ రోహత్గి
tiktok want to go court

చైనాకు చెందిన టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై భారత్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ సంస్థ‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ప్రయత్నాలు జరుపుతోంది. తమ తరఫున వాదించాలంటూ మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్ రోహత్గిని ఆ సంస్థ కోరింది. అయితే, ఆయన ఒప్పుకోలేదు. వారి అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు తెలిపి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనా యాప్‌ తరుఫున ఆ పని చేయబోనని స్పష్టం చేశారు.

దీంతో కోర్టుని ఆశ్రయించాలనుకుంటోన్న టిక్‌టాక్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలినట్లయింది. గతంలోనూ ఓ సారి టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం నిషేధించగా ఆ సంస్థ కోర్టుకెళ్లింది. తిరిగి భారత్‌లో పలు నిబంధనలతో ఆ యాప్‌కు అనుమతులు ఇచ్చారు. ఈ సారి మాత్రం చైనా దుందుడుకు చర్యల వల్ల ఈ యాప్‌ను నిషేధించిన నేపథ్యంలో న్యాయవాదులు ఆ యాప్‌ తరఫున వాదించడానికి ముందుకు రావట్లేదు. 

More Telugu News