Chandrababu: ప్రపంచమంతటా డాక్టర్లపై పూలు చల్లి ప్రశంసిస్తోంటే ఏపీలో డాక్టర్ల పరిస్థితి ఇది: చంద్రబాబు

  • ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి బాధేస్తోంది
  • డాక్టర్లకు ఇప్పటికీ పీపీఈ కిట్లు అందించలేదు
  • మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను కొట్టించారు 
  • ఇప్పటికైనా ప్రభుత్వం వైద్యుల సేవను గుర్తించి గౌరవించాలి
chandrababu fires on ap govt

ప్రాణదాతలైన వైద్యుల పట్ల ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి బాధేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. డాక్టర్లకు ఇప్పటికీ పీపీఈ కిట్లు అందించక పోవడం వైసీపీ ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని చెప్పారు. పీపీఈల కోసం విశాఖ ఈఎన్టీ ఆసుపత్రిలో డాక్టర్లు ధర్నా చేశారంటే ప్రభుత్వానికి ఎంత సిగ్గుచేటని ఆయన నిలదీశారు.
 
'మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసి, నడిరోడ్డుపై అర్ధనగ్నంగా, లాఠీలతో కొట్టించి, పిచ్చివాడని ముద్రవేసింది ప్రభుత్వం. ప్రపంచమంతటా డాక్టర్లపై పూలు చల్లి ప్రశంసిస్తోంటే ఏపీలో డాక్టర్ల పరిస్థితి ఇది. ఇప్పటికైనా ప్రభుత్వం వైద్యుల సేవను గుర్తించి గౌరవించాలి' అని చంద్రబాబు సూచించారు.

'వైద్యో నారాయణో హరి అన్నారు. కరోనా విజృంభిస్తున్నప్పటికీ తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా, అంకితభావంతో ప్రజలకు వైద్యసేవలందిస్తోన్న దేవుళ్లకి జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా చేతులెత్తి మొక్కుతూ... హృదయపూర్వకంగా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను' అని చంద్రబాబు చెప్పారు.  

More Telugu News