Jurala: ఈ సీజన్ లో తొలిసారి... జూరాలకు మొదలైన వరద!

  • తూర్పు కర్ణాటకలో వర్షాలు
  • చిన్న కాలువలు, వాగుల్లో పారుతున్న నీరు
  • 4 వేల క్యూసెక్కులకు పైగా వరద
Flood for Jurala First Time in This Season

ప్రస్తుత వర్షాకాల సీజన్ లో కృష్ణా నదిలో వరదనీటి ప్రవాహం ప్రారంభమైంది. తూర్పు కర్ణాటక ప్రాంతంలో పడుతున్న వర్షాలతో చిన్న చిన్న కాలువలు, వాగుల్లో పారుతున్న నీరు నదిలోకి వచ్చి దిగువకు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో జూరాల వద్ద ఈ ఉదయం 4 వేల క్యూసెక్కులకు పైగా నీరు వస్తోంది. జలాశయం సామర్థ్యం దాదాపు 10 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తుండటంతో, ఈ నెల రెండోవారంలోపు జూరాల నిండి శ్రీశైలానికి నీటి విడుదల ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు.

More Telugu News