Hyderabad: లాక్ డౌన్ దిశగా హైదరాబాద్.. ఏపీకి క్యూ కట్టిన ఆంధ్ర ప్రజలు.. హైవేపై ట్రాఫిక్ జామ్!

  • హైదరాబాదులో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు
  • మరోసారి లాక్ డౌన్ విధించడంపై కసరత్తు చేస్తున్న టీఎస్ ప్రభుత్వం
  • బోర్డర్ వద్ద వాహనాలను ఆపేస్తున్న ఏపీ అధికారులు
AP people going back to their state amid another lockdown news

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధించడంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి సంబంధించి సంకేతాలను ఇవ్వడంతో... ఆంధ్ర ప్రజలు స్వరాష్ట్రానికి పయనమవుతున్నారు.

దీంతో, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు రాష్ట్రంలోకి ప్రవేశించడానికి సాయంత్రం 7 గంటల వరకే అనుమతి ఉండటంతో... బోర్డర్ వద్ద అధికారులు వాహనాలను నిలిపి వేస్తున్నారు. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.

రేపటి నుంచి జరగాల్సిన ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, పీఈసెట్, ఎడ్ సెట్ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్టు టీఎస్ ప్రభుత్వం ప్రకటించడంతో... లాక్ డౌన్ తప్పదనే అంచనాకు ప్రజలు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రజలు స్వరాష్ట్రానికి తరలి వెళుతున్నారు.

More Telugu News