Sai Pallavi: నన్నలా పిలవద్దంటూ.. యాంకర్ పై సాయి పల్లవి ఆగ్రహం

Actress Sai Pallavi fires on TV anchor
  • సాయిపల్లవిని మలయాళీ అని పిలిచిన యాంకర్
  • తాను తమిళ అమ్మాయినని చెప్పిన సాయి పల్లవి
  • కోయంబత్తూర్ లో పెరిగానని వ్యాఖ్య

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న హీరోయిన్లలో చాలా మంది వారి గ్లామర్ ను నమ్ముకున్నవారే ఉన్నారు. పెద్దగా యాక్టింగ్ టాలెంట్ లేకపోయినా... అందచందాలతో ప్రేక్షకులను మైమరపిస్తూ, అవకాశాలను కొల్లగొట్టేస్తున్నారు. కానీ, అందంతో పాటు, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సాయిపల్లవి ముందుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ, ప్రేక్షకులకు ఆమె బాగా దగ్గరైంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ సినిమాల్లో కూడా నటిస్తోంది.

తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో యాంకర్ పై సాయి పల్లవి ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను మలయాళీ అని పిలవడంతో... తాను మలయాళీని కాదని స్పష్టం చేసింది. తాను తమిళ అమ్మాయినని... కోయంబత్తూర్ లో పెరిగానని చెప్పింది. ఇంకెప్పుడూ మలయాళీ అని పిలవొద్దని కోపంగా సూచించింది.

సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం రానాతో కలిసి 'విరాటపర్వంలో' సాయి పల్లవి నటిస్తోంది. నాగచైతన్యకు జంటగా 'లవ్ స్టోరీలో' నటిస్తోంది. వీటితో పాటు నాని, శర్వానంద్ సినిమాలకు కూడా ఓకే చెప్పింది.

  • Loading...

More Telugu News