హమ్మయ్య... నాకు కరోనా తగ్గింది... టెస్ట్ రిపోర్టు ఇదిగో: బండ్ల గణేశ్

30-06-2020 Tue 18:06
  • ఇటీవల కరోనా బారినపడిన బండ్ల గణేశ్
  • అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • కరోనా నయం కావడంతో హర్షం
Bandla Ganesh cured from corona
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇటీవలే కరోనా బారినపడ్డారు. మహమ్మారి వైరస్ సోకడంతో అటు ఆయన, ఇటు అభిమానులు అందరూ ఆందోళన చెందారు. తనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో బండ్ల గణేశ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. తాజాగా, కరోనా నయం కావడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. టెస్టు రిజల్ట్స్ లో తనకు కరోనా తగ్గిపోయిందన్న విషయం వెల్లడి కావడంతో థాంక్స్ గాడ్ అంటూ సోషల్ మీడియాలో స్పందించారు. తన టెస్టు రిపోర్టును కూడా పంచుకున్నారు.