Ponnam Prabhakar: వెయ్యి కోట్లు అయినా సరే కరోనాను ఎదుర్కొంటామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయి?: పొన్నం

Ponnam Prabhakar take a jibe at CM KCR on corona management
  • కరోనా నివారణలో కేసీఆర్ విఫలమయ్యారని వ్యాఖ్యలు
  • కరోనా టెస్టులు సరిగా జరగడంలేదని ఆరోపణ
  • జిల్లా కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహించడంలేదన్న పొన్నం
తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ సర్కారుపై మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు సరిగా నిర్వహించడంలేదని, హైదరాబాదులో తప్ప జిల్లా కేంద్రాల్లో కరోనా టెస్టులు చేపట్టడంలేదని అన్నారు. కరోనా సోకిన ప్రజాప్రతినిధులు గాంధీ ఆసుపత్రికి ఎందుకు వెళ్లడంలేదని ప్రశ్నించారు. వెయ్యి కోట్లు ఖర్చయినా వెనుకాడకుండా కరోనా వైరస్ ను  ఎదుర్కొంటామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని నిలదీశారు. కరోనా నియంత్రణలో కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. పారాసిటమాల్, వేడి నీళ్లు, హరితహారంతో కరోనా నివారణ జరుగుతుందా? అంటూ పొన్నం వ్యంగ్యంగా అన్నారు. 
Ponnam Prabhakar
KCR
Corona Virus
Tests
Hyderabad
Telangana

More Telugu News