Tamil Nadu: తమిళనాడులో కరోనా మరణమృదంగం.. ఒక్కరోజే 62 మంది మృతి!

In Tamil Nadu 62 people dies of Corona in a single case
  • గత 24 గంటల్లో కొత్తగా 3,949 కేసుల నమోదు
  • చెన్నైలో 2,167 కేసుల నమోదు
  • రాష్ట్రంలో 86 వేలు దాటిన మొత్తం కేసుల సంఖ్య
కరోనా మహమ్మారి తమిళనాడులో విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజు వేలాది కొత్త కేసులు నమోదవుతున్న ఈ రాష్ట్రంలో... ఈరోజు కరోనా మరింత ప్రభావాన్ని చూపింది. గత 24 గంటల్లో కొత్తగా 3,949 కేసులు నమోదయ్యాయి. ఏకంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో అర్థంకాని పరిస్థితులు తమిళనాడులో నెలకొన్నాయి. అత్యధిక కేసుల విషయంలో ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత తమిళనాడు మూడో స్థానంలో ఉంది.

తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 86,224కు చేరుకుంది. మొత్తం 1,141 మంది మృత్యువాత పడ్డారు. ఇక చెన్నై విషయానికి వస్తే.. నిన్న ఒక్కరోజే 2,167 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటితో కలిపి చెన్నైలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 55,969కి చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి మరెంత భయానకంగా ఉంటుందోనని అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
Tamil Nadu
Corona Virus
Cases

More Telugu News