Peter Paul: వనితా విజయ్ కుమార్ ను పెళ్లాడిన పీటర్ పాల్ కు మొదటి భార్య సెగ

First wife of Peter Paul complains police
  • మూడో పెళ్లి చేసుకున్న వనిత విజయ్ కుమార్
  • ఫిలింమేకర్ పీటర్ పాల్ తో క్రిస్టియన్ పద్ధతిలో వివాహం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన పాల్ మొదటి భార్య ఎలిజబెత్
  • విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకున్నాడని ఆరోపణ
ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత ఇటీవలే మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిలింమేకర్ పీటర్ పాల్ ను ఆమె క్రిస్టియన్ వివాహ సంప్రదాయం ప్రకారం పెళ్లాడింది. పీటర్ పాల్ కు గతంలో ఓ పెళ్లయింది.

ఇప్పుడు పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజబెత్ చెన్నై, వడపళని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన నుంచి విడాకులు తీసుకోకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని, పీటర్ పాల్ పై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరింది. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తాము గత ఏడేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నామని వెల్లడించింది.

కాగా, నటి వనిత విజయ్ కుమార్ కు గతంలో ఆకాశ్, ఆనంద్ జే రాజన్ లతో వివాహాలు జరిగాయి. కొంతకాలం రాబర్ట్ అనే వ్యక్తితోనూ డేటింగ్ చేసినట్టు ప్రచారం జరిగింది. అంతేకాదు, తన తండ్రి విజయ్ కుమార్ తో ఆస్తి వివాదాల్లోనూ ఆమె పేరు ఎక్కువగా వినిపించింది.
Peter Paul
Vanitha Vijaykumar
Elizabeth Helen
Marriage
Police

More Telugu News