Iqbal Ahmed: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్, అనుచరులు!

  • కేంద్ర పథకాల పేరుతో సైబర్ నేరగాళ్ల వల
  • రూ.10 లక్షలు దోచేసిన సైబర్ క్రిమినల్స్
  • నిందితులను క్వారంటైన్ కేంద్రం నుంచి అదుపులోకి తీసుకున్న పోలీసులు
Cyber criminals cheated MLC Iqbal Ahmed

సైబర్ నేరగాళ్ల చేతిలో సామాన్యులే కాదు, ప్రజాప్రతినిధులు కూడా మోసపోతున్నారు. కేంద్ర పథకాల పేరుతో ఎమ్మెల్సీ ఇక్బాల్ కు, ఆయన సన్నిహితులకు సైబర్ క్రిమినల్స్ టోకరా వేశారు. రెండ్రోజుల క్రితం సబ్సిడీ రుణం పేరుతో ఎమ్మెల్సీ ఇక్బాల్ అనుచరుల నుంచి రూ.10 లక్షలు దోచేశారు. అనంతరం, ఎమ్మెల్సీ ఇక్బాల్ కు దీనిపై అనుమానం రావడంతో సీఎంవో, పరిశ్రమ శాఖ అధికారులను ఆరా తీశారు.

అయితే అలాంటి పథకాలేవీ లేవని అధికారులు సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్సీ కంగుతిన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు తూర్పుగోదావరి జిల్లా క్వారంటైన్ కేంద్రంలో ఉన్నట్టు గుర్తించారు. నిందితులు బాలాజీ నాయుడు, వెంకటరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. బాలాజీ నాయుడు గ్యాంగ్ పై తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్టు గుర్తించారు.

More Telugu News