ఈ గడ్డపై పుట్టినవాడే దేశాన్ని కాపాడతాడు: రాహుల్ పై ప్రగ్యా ఠాకూర్ పరోక్ష వ్యాఖ్యలు

29-06-2020 Mon 14:14
BJP MP Pragya Thakur hits out Congress Party
  • కాంగ్రెస్ నేతలకు ఎలా మాట్లాడాలో తెలియదన్న ప్రగ్యా
  • విదేశీ వనితకు పుట్టినవాళ్లు దేశభక్తులు కాలేరని వ్యాఖ్యలు
  • కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు

చైనాతో సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపైనా, ఆ పార్టీ అధినాయకత్వంపైనా బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల్లో పౌరసత్వం ఉన్నవారికి దేశభక్తి అనుభూతి ఎలా కలుగుతుందని ప్రశ్నించారు. ఈ గడ్డపై జన్మించినవాళ్లే దేశాన్ని కాపాడతారని, ఓ విదేశీ వనితకు జన్మించిన వాడు దేశభక్తుడు కాలేడని చాణక్యుడు చెప్పారని పరోక్షంగా సోనియా, రాహుల్ గాంధీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నిశిత పరిశీలన చేసుకోవాలని, దేశభక్తి, నీతి, నైతికతలకు కాంగ్రెస్ పార్టీ దూరమని విమర్శించారు. ఎలా మాట్లాడాలో ఆ పార్టీ నేతలకు తెలియదని అన్నారు.