Telangana: తెలంగాణలో కరోనా కేసుల వెల్లువ... కొత్తగా 983 మందికి పాజిటివ్

Telangana witnesses more positive cases
  • జీహెచ్ఎంసీ పరిధిలో 816 కేసులు
  • ఇవాళ 244 మంది డిశ్చార్జి
  • మరో నలుగురి మృతి
తెలంగాణలో కరోనా రక్కసి విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ భూతం కట్టలు తెంచుకుని విజృంభిస్తోంది. తాజాగా 3,227 శాంపిల్స్ పరీక్ష చేయగా 983 మందికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో 816 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వాళ్లే. రంగారెడ్డి జిల్లాలో 47, మంచిర్యాల్ జిల్లాలో 33, మేడ్చెల్ జిల్లాలో 29 కొత్త కేసులు వెల్లడయ్యాయి.

కొత్త కేసుల రాకతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,419కి పెరిగింది. ప్రస్తుతం 9 వేల మంది చికిత్స పొందుతుండగా, 5,172 మంది డిశ్చార్జి అయ్యారు. ఇవాళ ఒక్కరోజే 244 మందిని డిశ్చార్జి చేశారు. ఇక, తెలంగాణలో తాజాగా 4 మరణాలు సంభవించాయి. దాంతో కరోనా మృతుల సంఖ్య 247కి పెరిగింది.
Telangana
Corona Virus
Positive
Deaths
Disharge
COVID-19

More Telugu News