Nurses: కరోనా విజృంభణ... కేరళ నుంచి నర్సులను ప్రత్యేక విమానాల్లో తీసుకువస్తున్న హైదరాబాద్ ఆసుపత్రులు!

Hyderabad hospitals flew Kerala nurses on Chartered flights
  • తెలంగాణలో కరోనా కల్లోలం
  • విపరీతంగా పెరుగుతున్న కేసుల సంఖ్య
  • పేషెంట్లతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు
తెలంగాణలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. నిత్యం వందల సంఖ్యలో కొత్త కేసులు వస్తుండడంతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఓవైపు సుశిక్షితులైన నర్సులకు కూడా కొరత ఏర్పడింది. దాంతో హైదరాబాదులోని రెండు ప్రైవేటు ఆసుపత్రులు కేరళ నుంచి హుటాహుటీన 50 మంది నర్సులను చార్టర్డ్ విమానాల్లో తీసుకువచ్చాయి. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో నర్సులకు ప్రాధాన్యత ఏర్పడింది. వారికి అధిక వేతనాలను ఇచ్చేందుకు కూడా ఆసుపత్రుల యాజమాన్యాలు సిద్ధపడుతున్నాయి.

దీనిపై తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ రుడావత్ మాట్లాడుతూ, తాత్కాలిక ప్రాతిపదికన అయినా నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు, ఒక్కో నర్సుకు రూ.50 వేల వరకు జీతం ఆఫర్ చేస్తున్నాయని వెల్లడించారు. సాధారణంగా నర్సులకు ఇచ్చే జీతానికి ఇది మూడు రెట్లు ఎక్కువని అన్నారు. నర్సులు కావాలంటూ తమకు రోజుకు 10 నుంచి 15 కాల్స్ వరకు వస్తున్నాయని తెలిపారు.
Nurses
Kerala
Hyderabad
Private Hospitals
Corona Virus
Telangana

More Telugu News