Varun Tej: మెగా హీరోకి టైటిల్ ఇచ్చేసిన పూరి?

Puri Jagannath gives away his title to VarunTej
  • విజయ్ దేవరకొండతో పూరి యాక్షన్ చిత్రం
  • వర్కింగ్ టైటిల్ గా వాడుతున్న 'ఫైటర్'
  • వరుణ్ తేజ్ హీరోగా మరో యాక్షన్ సినిమా
  • టైటిల్ అడగడంతో ఇచ్చేసిన పూరి     
మన సినిమా ఇండస్ట్రీలో టైటిల్స్ విషయంలో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం మనకు కనిపిస్తూవుంటుంది. ఒకరు రిజిస్టర్ చేసుకున్న టైటిల్ని మరొకరు అడిగితే ఇచ్చేయడం మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. తాజాగా అలాగే ప్రముఖ దర్శకుడు పూరి తన టైటిల్ని మెగా ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరో వరుణ్ తేజ్ సినిమాకి ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది.

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రముఖ నటి ఛార్మి ఓ యాక్షన్ ఫిలిం నిర్మిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొదటి నుంచీ 'ఫైటర్' అనే పేరుని వర్కింగ్ టైటిల్ గా చెబుతున్నారు. దీనిని ఈ చిత్రం కోసం రిజిస్టర్ కూడా చేశారు.

అయితే, ఇదే సమయంలో వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కుమార్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ ఓ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రానికి 'ఫైటర్' అనే టైటిల్ బాగా సూటవుతుందని భావించి, పూరీని రిక్వెస్ట్ చేశారట. దాంతో పూరి సహృదయంతో టైటిల్ని వరుణ్ తేజ్ చిత్రానికి ఇచ్చేసినట్టు చెబుతున్నారు.    
Varun Tej
Puri Jagannadh
Vijay Devarakonda
Charmi

More Telugu News