Corona Virus: దేశంలో 5 లక్షలు దాటేసిన కరోనా కేసులు.. ఒక్కరోజులో 18,552 మందికి సోకిన వైనం

  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 5,08,953
  • మృతుల సంఖ్య మొత్తం 15,685
  • 1,97,387 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • నిన్న ఒక్కరోజులో 2,20,479 శాంపిళ్ల పరీక్ష
Over 18000 coronavirus cases in India in 24 hours in biggest one day jump

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 18,552 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 384 మంది మరణించారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,08,953కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 15,685కి పెరిగింది. 1,97,387 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,95,881 మంది కోలుకున్నారు.

కాగా, జూన్‌ 26 వరకు దేశంలో మొత్తం 79,96,707 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,20,479 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.

More Telugu News