Work: ఏపీలో ఐదురోజుల పనిదినాల వెసులుబాటు మరో ఏడాది పొడిగింపు

  • రేపటితో ముగియనున్న ఐదు రోజుల పనిదినాల గడువు
  • సీఎం దృష్టికి తీసుకెళ్లిన అజేయ కల్లం
  • పొడిగింపునకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్
Five days work in a week in AP extended

ఏపీ సచివాలయం, హెచ్ వోడీ (శాఖాధిపతుల కార్యాలయాలు) ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాల వెసులుబాటు కల్పిస్తూ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా వెసులుబాటును మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వులపై సచివాలయ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.

గత ఉత్తర్వుల ప్రకారం ఐదు రోజుల పనిదినాల గడువు ఈ నెల 27తో ముగియనుంది. ఈ విషయాన్ని సీఎం ముఖ్య సలహదారు అజేయ కల్లం ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించడంతోపాటు మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయించారు. సీఎం నిర్ణయం పట్ల ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News