Yusuf Memon: ముంబై పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న యూసుఫ్ మెమన్ మృతి

  • 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషి యూసుఫ్ మెమన్
  • ఉదయం స్పృహ తప్పి పడిపోయిన యూసుఫ్  
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Mumbai blasts convict Yusuf Memon dies of heart attack

1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యూసుఫ్ మెమన్ మృతి చెందాడు. నాసిక్ లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్న యూసుఫ్ గుండెపోటుతో చనిపోయినట్టు జైలు అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటల సమయంలో బ్రష్ చేసుకునే సమయంలో యూసుఫ్ స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని నాసిక్ ప్రభుత్వ ఆసుపత్రికి జైలు అధికారులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను ప్రాణాలు విడిచాడు. అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ధూలే మెడికల్ కాలేజీకి పంపారు.

ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన టైగర్ మెమన్ కి యూసుఫ్ సోదరుడు. ఈ కేసులో దోషిగా తేలడంతో కోర్టు యూసుఫ్ కి యావజ్జీవ కారాగారశిక్షను విధించింది.

More Telugu News